Monday, 14 May, 2007

 

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ...
విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా ...
ఎప్పుడూ...............................
నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్కముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల
మొప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురసంధ్య
ఒక్కనాడు నెగ్గలేదురా
గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు
తూరుపింట తేలుతుందిరా
నిశా విలాసమెంత సేపురా
ఉషోదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండెకూడా సూర్యగోళమంటిదేరా
ఎప్పుడూ.....................
నొప్పి లేని నిముషమేది జననమైనా మరణమైనా
జీవితాన అడుగడుగునా...
నీరసించి నిలిచిపోతే నిముషమైనా నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తువుంది
అంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను
శ్వాస నీకు శస్త్రమౌను
ఆశయమ్ము సారధౌనురా
నిరంతర ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటు ఉన్నవరకు
చావు కూడ నెగ్గలేక
శరము పైనె గెలుపు చాటురా
ఎప్పుడూ......................

Labels:


Comments: Post a Comment





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]