Sunday, 13 May, 2007

 

వేమన జ్ఞానమార్గ పద్యములు - రెండవ భాగము (Verses of Vemana -Part 2)

పిలిచిన బల్కకుండు, మరి పిల్చిన వేకనకూరకుండు, తా
దలచిన ఎవ్వరే మనిన దన్నును గాదని నవ్వుచుండు, నా
త్మల దలపోయుచుండు పరతత్వము నిత్యము దానమై సదా
తెలిసిన యోగి వేమనగతి శివరూపుడు నెల్ల తావుల

Though called yet remain silent; Though even again called yet maintain silence, whatever they think, or any one say, let the wise smile as though it was not intended for them; let them meditate in their souls on the supreme, hereby becoming themseles eternal. The hermit thus persistingly learneth like Vemana for ever attain the form of God.

ఒక్కడు రోగి యాయె మరియొక్కడు దిక్కుల ద్యాగియాయె వే
రొక్కడు భోగియాయె నటు యొక్కడు చక్కని యోగియాయె దా
నొక్కడు రాగియాయె నినుబోలు మహాత్ముని గాన మెచ్చ
నిక్కము ఇన్ని రూపములు నీకును జెల్లును నన్న వేమన

One man became discased, one became a donor every where, another became a possessor-such a man became a true saint. One himself became a libertine. but nowhere shall we see a mighty sage like to thee O Vemana-truly all these various forms pertain to thee O brother.

విషయముల దెరలి పొలుపుగ
విషయము లంటక మహాత్ము విధమున ధరలో
విష సంసారము లనియును
విషయము లన్నియును గెల్వ వేమన నేర్చు.

Agreeably to the character of an ascetic relinquish all the objects of carnality (passion). Touch not carnel objects after the manner of a magnanimous sage on earth, consider them the offspring of carnality. Vema hath learned, to subdue all carnality.

కాదని యెవ్వరి తోడను
వాదడవక తిరుగు వెర్రివానిం బలెనే
భేదాభేదము లడచిన
వేదాంత రహస్య మెల్ల వేమన నేర్చు.

Vemana openeth not his mouth to say not to anyone's assertion. Thus he seems like a mad man. He can explain every mystery of that Vedantam which destroys all distinctions and differences. From his knowledge his pathy arises.

పూజ చక్క జేసి పుణ్య మార్జించిన
పూజ్యుడైన గురువు పూజవలన
తేజ మెల్లగాంచి తిరుగ డెన్నటికైన
విశ్వదాభిరామ వినురవేమా !

The worshipful teacher who by the due performances of worship hath attained merit. H by that worship shall see(i.e obtain). Never shall he be changed.

దాన మమరజేసి దరిజేరు నొకవంక
మనము నమ్మెనేని మాయాగల్గు
జ్ఞానకళిక నమ్మి జంపును వైరుల
విశ్వదాభిరామ వినురవేమా !

By freely bestowing gifts you on one hand attain heaven but if you trust to your own mind delusion enters. Trust to the light of wisdom to destroy all that is inimical.

ఇందు నెరుకవాని కిహపరములు లేవు
ప్రాణహాని లేదు ప్రళయమునకు
ప్రళయకాలమైన పరమాత్మ గలయురా,
విశ్వదాభిరామ వినురవేమా !

He whom in this world know wisdom to him, there was no next world(he is as if in heaven). He shall not lose his soul even in death of Brahma. In that he shall be absorbed in the divine mind.

దేవుడనగ వేరె దేశమందున్నాడె
దేవితోడ నెపుడు దేహ మందె
వాహనముల నెక్కి వడి దోలుచున్నడు
విశ్వదాభిరామ వినురవేమా !

Is he whom yo call God in another land? With the Goddess, he is in the body. Mounting his vehicles (the senses), he rapidly drives his chariots.

సొమ్ము దొరుకుదనుక జ్యోతి యంతియె కాక
సొమ్ము దొరుకువెనుక జ్యోతి యేల
దేవుడైన వెనుక దేహంబు యదియేల
విశ్వదాభిరామ వినురవేమా !

Until you find the thing you have lost, you require a light-only so long- after finding it why keep the light? After becoming God why retain the body

గురుచరణము బట్ట కుక్కలు కరుచునా
గురుచరణము విడువ కుక్కగరుచు
కుక్కకున్న గుణము గురునకు లేదురా
విశ్వదాభిరామ వినురవేమా !

If thou fall at the feet of the teacher will the dog of passion seize ye thee? If you leave the teacher's feet, those dogs will seize thee. Indeed, the dog's disposition does not attach to the teacher.

Labels: ,


Comments: Post a Comment





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]