Saturday, 19 May, 2007

 

వేమన జ్ఞానమార్గ పద్యములు - ఐదవ భాగము (Verses of Vemana -Part 5)

ఆశ విడకకాని పాశముక్తుడు గాడు
ముక్తుడైన గాని మునియు గాడు
మునికిగాని సర్వమోహంబు లూడవు
విశ్వదాభిరామ వినురవేమా !


Unless thou give up thy lusts thou shall not be releases from thy ties. Unless thou be free thou art no devotee. None but a devotee can be freed from all desires.


ఆత్మలోని నాద మాలించి యాలించి
యాశలందు జిక్క డాదియోగి
యాత్మలోని కళల నంటు నా తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమా !

If you listen and listen to the voice within thy soul, the first saint shall not be entangled in desires. If thou attain light in the soul, this beatitude.

మానసంబు మంచి మల్లెసాలె చవికె
బావితోట జేసి బాలగూడి
భోగి నయ్యద నన బోయెబో కాలంబు,
విశ్వదాభిరామ వినురవేమా !


Convert thy mind into a fair chamber built in summer mansion (pleasure house) with a bath, well and garden. Prepare it for meeing the maid of wisdom in secret and enjoying her charms. Thus let thy hours sweetly glide away.


సొమ్ము ఉన్నచోట శోధింపగలుగును
సొమ్ము లేనిచోట శోధ యేల
అంజనంబు లేక ఆ సొమ్ము తెలియదో
విశ్వదాభిరామ వినురవేమా !

If thou search in the place where the thing is, thou shall find it. Why search in a place where it is not? Without the conjuration of deep thought thou cannot attain that thng that is above all desirable.

నిజము నేల నెరిగి నిత్యుండు గాడయ
పలుకులోని బిందు పదిలపరిచి
వేడుకైన బిందు వెత పెట్ట కుందురా
విశ్వదాభిరామ వినురవేమా !

How did he learn all the truth, and yet fail of becoming the Eternal; carefully ascertaining the mystic word in abstraction, they distribute instruction regarding the wondrous form.(loose version).


అగ్నిశిఖలయందు నమరంగ మమకార
మభవు మీద ధ్యాన మలర నునిచి
యాహుతియగు వెనుక హరున కర్పితమౌను
విశ్వదాభిరామ వినురవేమా !


In the flame of fire when thou hast firmly immolated (as a holocaust) all personal affection fixing thy thought on the unborn, this shall be an acceptable dedication to Hari.

మాకున ననలము బుట్టును
మాకెరుగునె ననలమునికి మనుజులలోన
మాకున ననలము క్రియ జీ
కాకుడిగిన యోగి నెవరు గానరు వేమా


Though fire is produced in a tree, is the tree conscious of that fire? Like the fires is concealed in the tree, thus no one can perceive the nature of the devotee who hath dispelled those passions that harass the soul.


అండములో నాకాశం
బుండంగా చూడ జూడ నొనరగనాపై
నుండును, అన్నియు దెలిసిన
మెండుగ నెటుచూచి చన్న మేలగు వేమా

To gaze and gaze on the firmament in the mundane egg shall be excellently sweet to the sage if he fully meditates on it; abundantly blessed shall he be in whatever direction he directs his view or his steps.

బమ్మగుడ్డు యనెడి పట్నంబు లోపల
బమ్మ యెరుగలేని బాప డేల
తన మనంబు దెలియ దానెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా !


How can he be a (brahmin) Divine who knoweth not (Brahma) the Divinity in the city of the Divine egg or universe? To understand by own mind, go to, this is (Brahminity) Divinity.

గురువు చెప్పువిద్య గురునకు దెలియును
గురువు చెప్పు విద్య గురువు యెరుగు
గురువు మహిమ పరమగురునకు దెలియును
విశ్వదాభిరామ వినురవేమా !


The science taught by a teacher is known to the teacher. The teacher knoweth what the teacher explaineth. The power of the teacher is known to the primal teacher.

Labels: ,


Comments: Post a Comment





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]