Saturday, 19 May, 2007

 

వేమన జ్ఞానమార్గ పద్యములు - ఏడవ భాగము (Verses of Vemana -Part 7)

ఉండడె సుఖశీలి యుండును కొన్నాళ్లు
యుండి యుండి యుండి యుండలేక
యుండ వెరవు దెలిసి గండు దొంగను బట్ట
చెండి చెండి తావు జేరు వేమా


Is not there one man living of good position? He may live some days in comfort. After living, living and living he lives no longer. If he will know the path to happiness, let him seize that stout thief, his mind cut into pieces and prepare a dwelling for himself in heaven.


తను వనేటి యింట తన శత్రు మిత్రుల
దెలియని వాని తెలివదేమి
తెలిసిన మనుజునకు దివ్యామృతంబురా
విశ్వదాభిరామ వినురవేమా !


What is the wisdom of that man who in the house of the body cannot distinguish his friends and foes? On him who knoweth them shall Divine ambrosia (amrutham) be bestowed.


నది నుదకంబును జనుక్రియ
మది నొదవెడు తత్త్వబుద్ధి మగ్నత లెల్ల
తుద పదవిగలయ ఘనుడగు
నుదధి ప్రవేశించుగంగ యెప్పున వేమా!


Like as water flows in its channel thus does an immersion in that knowledge of ruth that arises in the mind ultimately (through an absorption in the final essence) constitute the perfect saint. Then is he like to the Ganges when her streams reach the ocean ( a corret version of awful intricacy).


మనసు బారవిడిచి మనసు దా మగుడించి
మనసులోన గలుగు మర్మ మెరిగి
మనసు దాను నిల్ప మరియు దా బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా !


Casting away the mind and turning it back knowing the secret heart and if thou fix thy mind, this is the greatest task of religion.


దేహాభిమన ముండగ
మోహాదులు జననవార్ధి ముంచును కలగా
నీహారి విషయ భావన
కూహాదులు బోలు మేలుకొన్నను వేమా


While pride of body remains, love and he lust plunge us in the ocean of reproduction. Therfeorre, desire, mental enemies, senses, thoughts, deceit and fraud are all like to dream, let us awake O Vema!


మర్మమంత గొనక మనసు యేకము గాక
పరరహస్యమంత బైలపడదు
పడిన మానమెన్న బైల బడినరీతి
విశ్వదాభిరామ వినురవేమా !


If you comprehend not the entire secret and if thy mind be not bound up to one aim, the Divine secret shall not be revealed to thee. Should it be shewn openly it would be but as the unveiling of the secret parts.


ఈ తనువునందు జూచిన
నేతనువుల కింతె యనుచు నెదురుం దన్నుం
జూతురుగా లోజూపున
నాతురమున తపసునెల్ల నమరగ వేమా


If we look into these our bodies let us with inner vision consider that the nature our forms possess is also that of all other bodies - with devotion do all penitents, behold this.


గురువు పరమ గురుని గురుతుగా దెలియక
గురువు తానుయుండు గుడ్డిరీతి
గురునకు గురులైన గురువు ప్రాణేశుండు
విశ్వదాభిరామ వినురవేమా !


If the teacher knows not in his character, the prime teacher, he is himself as blind. The teacher who teaches the teacher is the lord of life.


నియమాది సంగుడై నిలిచిన తత్త్వంబు తామసంబగు నిద్ర దలగజేయు
నిద్ర తలంగిన నిర్భీతి నొందించు శమమున నానంద సమితి పుట్టు
నానందమున విశ్వమంతయు దానగు తాను విశ్వంబైన్ తత్త్వమగును
తత్త్వ మింద్రియ పంచకత్వంబునను నిల్చు తత్త్వంబు నిలిచిన దానెయగును
రాజయోగీంద్రు డాతడై తేజరిల్లు
వెలయ జగముల విహరించు విశ్రుతముగ
బాలుని విధంబునను వృద్ధు పగిది సోకు
కరణి వెంగలిక్రియ జూడ ఘనత వేమ


If first thy intellect steadfastly attached to thy resolution, it shall dissipate this blind sleep. If this sleep be dissipated, it shall cause thee to attain fearlessness. By trnquility thou shall gain the assemblage of all felicity. By that felicity thou shall become the whole world. By being united to the universe thou shalt become divine essence. By subduing thy senses, the essence (permanent life) shall remain stable in thee. If thou thus fix divine essence, thou shalt become it. By becoming the lord of the king of saints thou shalt shine brilliantly; thou shalt walk in delight and with deliracy like an infant, like to an aged man, like a spirit (nocturnal apparition) like a mad man shalt thou be. Behold thus, shalt thou act in thy dignity.



మనసున నెరుకను మరుపును
గని విని చూడంగలేరు కదిపిన పిదప
పెనగొని పట్టేమంటే
మనుచోటను మాయ మాయ మహిలో వేమా


Whatever there be of knowledge and ignorance in the mind, we can neither perceive, see nor hear it. If we attempy to ake hold on the mind to seize and bind it we shall see that the body is replete with delusion and nothing but delusion.

Comments: Post a Comment





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]