Tuesday, 5 June, 2007

 

బుక్కులు

కుక్కపిల్లా, అగిపుల్లా, సబ్బుబిళ్ళా-
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!
రొట్టేముక్కా!, అరటితొక్కా, బల్లచెక్కా-
నీ వేపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!
తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం, గుర్రపుకళ్ళెం-
కాదేదీ కవిత కనర్హం!
ఔనౌను శిల్ప మనర్ఘం!
ఉండాలోయ్ కరితావేశం!
కానీవోయ్ రస నిర్దేశం!
దొరకదటోయ్ శోభాలేశం!
కళ్ళంటూ ఉంటేచూసి,
వాక్కుంటే వ్రాసీ!
ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం!

Labels:


Comments: Post a Comment





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]