Tuesday, 5 June, 2007
సాహసి
ఎగిరించకు లోహవిహంగాలను!
కదిలించకు సుప్త భుజంగాలను!
ఉండనీ,
మస్తిష్కకులయంలో!
మనోవల్మీకంలో!
అంతరాళ భయంకర
ప్రాంతరాలనా నీ విహారం?
ముళ్ళాదారినా నీ సంచారం?
పలికించకు మౌనమృదంగాలను!
కెరలించకు శాంత తరంగాలను!
హృదయంలో దీపంపెట్టకు!
మంత్రనగరి సరిహద్దులు ముట్టకు!
కదిలించకు సుప్త భుజంగాలను!
ఉండనీ,
మస్తిష్కకులయంలో!
మనోవల్మీకంలో!
అంతరాళ భయంకర
ప్రాంతరాలనా నీ విహారం?
ముళ్ళాదారినా నీ సంచారం?
పలికించకు మౌనమృదంగాలను!
కెరలించకు శాంత తరంగాలను!
హృదయంలో దీపంపెట్టకు!
మంత్రనగరి సరిహద్దులు ముట్టకు!
Labels: sri_sri_maha_prasthanam
Subscribe to Posts [Atom]