Tuesday, 29 May, 2007
వేమన జ్ఞానమార్గ పద్యములు - పదవ భాగము (Verses of Vemana -Part 10)
నరు లెల్లరు జొక్కి చిక్కి నయగతి యనుచున్
అరుగుదురు గాక తత్వము
నరయగ గనలేరు యించుకైనను వేమా
All men are intoxicated and entangled in the six inmical causes of evil propensities. Imagining this to be the path of prudence they walk in it; but they cannot view and perceive the truth of god.
మ్రాను కాలవేసి మహిమీద నొకజాణ
పూని తిరుగుచుండు బొదుగాను
కాలవేయుమ్రాను కడు రమ్యముగనుండు
విశ్వదాభిరామ వినురవేమా !
Burning the tree of earthly ties, the wise man engaging himself in wisdom proceeds with propriety. The tree thus burnt will be very delightful.
బయలున బంధము గప్పను
బయలున బరమాత్మనకును బంధము మెలగు
బయలున బంధము లూడిన
నయవర్తన ముక్తిగాంచు నరుడటు వేమా
Seeing that connections keep the world in darkness, connections yet form a tie between man and his creator. If all these connections were dissolved, then in the true path should man see beatitude. (Loose version)
అగ్రమందు జూపు యభ్యాసవిధి నిల్పు
మధ్యమందు జూపు మనసు నిల్పు
నంతమందు జూపు నరయ నాపోజ్యోతి
విశ్వదాభిరామ వినురవేమా !
The eye is first fixed on the path of instructions. In the midst, when we have learned somewhat the view dwelleth on our own mind, and at the last the vision resteth on Him, who is pure light.
ఎప్పుడు జూచిన ఇతర మేమియు జూడక ముక్తి యందుక
రెప్పలమూసి మూయకను రేయిబగల్ ఒకరీతి నుండగా
తప్పుల నొందజేయు యమధర్ముని పాలికి వొంగనేర్చునే
చెప్పగనెమి వేమనకు జెల్లును ముక్తివిధాన మంతయు
Whenever you behold him he is looking at nothing else; he fixes his eyes quivering lids upon beatitude night and day in one fixed manner, shall he ever learn to bow to Yama who visiteth the sins of men? What more need we say the whole way of beatitude shall be attained by Vemana
మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు
మంత్ర ముడుగకున్న మనసు నిలదు
మనసు నిల్వకున్న మరి ముక్తి లేదయా
విశ్వదాభిరామ వినురవేమా !
Unless thou relinquish vain words, the formula (of prayer and worship) cannot be learnt; unless thou relinquish the form of prayer and become absorbed in meditation the mind cannot be restrained. Unless thou restrain thy mind thou shalt not attain beatitude.
ఎండ చీకటులకు నిమ్మయి యుండెడు
నిండుకుండలోన నిద్ర మరచి
దండియైన పరమ తత్వంబు దెలియదు
విశ్వదాభిరామ వినురవేమా !
In this filled vessel of the body with which light and darkness agree well, if we forget the sleep of meditation, however great be we cannot know the first thing.
కడిగి సంకల్పములనెల్ల గట్టిపెట్టి
చిత్తమననేమి దల్పక చిత్రరూపు
కై వడిని యున్న యాతడు ఘనుడు తలప
నడవియందైన పట్టణ మందు వేమా!
He that will strive and bind all the designs, or think not on anything in his mind, but be like as a picture, this is the truly great man, whether he be in forest or town.
రెప్పలు మూసియు మూయక
దప్పక దన మనమునందు తత్వముగూడన్
ఎప్పుడు జూచెడు వానికి
జొప్పడు నెచ్చోట ముక్తి సులభమా వేమా
He who will remain in contemplation with quivering eyelids and fail not to fix the Being in his mind, but perpetually view him-easy is not anywhere for beatitude to be duly placed in him.
తలచిన తత్వం బగునా
తలపక తా నూరకున్న తత్వం బగునా
తలపును దలపమి రెండును
తలపమితో నుండెనేని తత్వము వేమా
By mere thinking shalt thou attain truth? If thou meditate not, but remain still shalt thou reach it? By thinking neither on thought nor on the absense, this is true path and beatitude.
Labels: vemana_padyamulu, verses_of_vemana
వేమన జ్ఞానమార్గ పద్యములు - తొమ్మిదవ భాగము (Verses of Vemana -Part 9)
పగ యుడుగ గోర్కులుడుగు పరజన్మంబుల్
తగులుడుగు భేద ముడిగిన
త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా
Strife ceases when anger ceases; when strife ceases wishes also cease. The connections that lead to future transmigrations cease when distinctions are donw away and when the three qualities of virtue, pasion and ignorance are dissolved, beatitude is permanent, O Vema
ప్రణవ మెరుగనోడు భక్తు డెప్పుడు గాడు
జ్యోతి యెరుగనోడు యోగి గాడు
నిత్య మెరుగనోడు నిర్మోహి గాడయా
విశ్వదాభిరామ వినురవేమా !
He that knows not the mystical syllable, Om, never can become a saint. He that knows not the glory of god is no yogee. He that knows not the everlasting is not in a state of beatitude.
ఇంద్రియ జయమునకు యేకస్థుడై తత్వ
మెరిగి పిదప తన్ను నెరుగడేని
యట్టివాని జ్ఞాని యని వేత్తలందురా
విశ్వదాభిరామ వినురవేమా !
By conquering the senses he that is steady knows the essence of god. How should a man not knowing himself will call such a man sage?
పగలు రేయు జూడ భావంబులోపల
దాను నేను యనెడు తలపు మరచి
యున్నయట్టి యతడు యుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినురవేమా !
He who daily and higly considers and forgets from his mind the distinctions of I and thou and he that thus liveth the noble ascetic.
తన్ను వెదికిజూడ దానెపో జీవుండు
తత్వ మరసిజూడ దానె యాత్మ
మన్నుమిన్ను లేదు మాయ తా లేదయా
విశ్వదాభిరామ వినురవేమా !
Search and view thyself; thou art the living being. Behold the great (tatwa) existent and thou shalt become the spirit. Earth and heaven shall depart and delusion herself be destroyed.
మఠములోని వాని మహిమలన్ని తెలిసి
కుటిలమతిని బట్టి కూలవేసి
ఘటము నిల్పువాడు ఘనతరయోగిరా
విశ్వదాభిరామ వినురవేమా !
He who konwing all powers of Him who dwelleth in the dwelling shall seize his evil mind and seat it. He who can retain his body is the greatest of devotees.
మూలచక్రమట్టె మొనని గట్టిగ బట్టి
శోధజేసి శక్తిచొరవ దెలిసి
భేదపరచి మనసు వాదించి మోక్షము
సాధ్యమైన యోగి సరణి వేమ
If thy apply thy heel and hold it firmly to thy anus and then see for thy interior so as to understand the entrance of power, then if thou also cause a change in thy mind (give thy word) and determine on attaining felicity and it becomes the perfection. This is the path of perfection ( or yoga).
నేమమునను నుండనిల్చును చిత్తంబు, తామసముననుండ తలగిపోవు
నిలువైన చిత్తము నిర్భీతి నొందించు, నిర్భీతి సఖ్యంబు నీరసించు
సఖ్య దూరగుణంబు శమమును బొందించు, శమగుణమున జూడ సమతబుట్టు
నట్టి సమత విశ్వమంతయు దానగు తానె విశ్వంబైన తత్వ మగును
తత్వ మింద్రియముల దరిజూచి గెలుచును
తత్వవేత్తయైన తానె యగును
రాజయోగి యగుచు తేజంబు చేతను
వెలసియుండు జగతి వినుర వేమ
By aid of the observances, the mind is stayed. By wrath it is dissipated. The steadfast mind obtains fearlessness. Resolution puts and end to alliance. The mind that is removed from alliance suffers us to attain tranqulity. From tranquility is equality he himself becomes the entire world. If he be transmuted into the universe, he is Essence (tatwa). That Essense will watch its oppurtunity and vanquish all the senses. If he becomes thus skilled in tatwa he shall become it himself. He shall thus be a raja yogi in lustre and shine in the world.
మాట చెరుపుమాట మర్మము కర్మము
ఆసలు కడకట్లు యప్పు ముప్పు
బాస దోసమెన్న పలుకులు ములుకులు
లేశ మైన తెలియలేరు వేమ
Words are a pack of evils; to keep a matter secret is a virtue; a varice is like to death. loan a misfortune, an oath is an evil, words are arrows-all this is not in the least known to men.
తొమ్మిది కంతల తిత్తికి
నిమ్మగు సొమ్ములును కులము నేటికి జెపుమా
నమ్మకు దేహము నాదని
బమ్మము నే ననుచు దెలిసి పలుకర వేమా
Why does this body, a bag with nine holes in it, require convenient things and a high caste, tell me. Believe that it is thine. Understand and say I am Brahma.
Labels: vemana_padyamulu, verses_of_vemana
వేమన జ్ఞానమార్గ పద్యములు - ఎనిమిదవ భాగము (Verses of Vemana -Part 8)
సమముగ నరదేవ సభలయందు
అందరు ఘనులైన హరునకు తావేది
విశ్వదాభిరామ వినురవేమా !
Though we know delusion to the death, we cannot quit it in the courts of God. They cannot see his equals and co-equals. Were all almighty, would there be a distinguished place for God?
బ్రతుకుటెల్ల మాయ భవబంధములు మాయ
తెలివిమాయ తన్ను దెలియ మాయ
మాయ దెలియువాడు మర్మజ్ఞు డగుయోగి
విశ్వదాభిరామ వినురవేమా !
All this life is illusion; posession and conncetions are delusion; understanding is delusion. I myself on consideration, and delusion. He that understands this illusion is sage that comprehends the great secret.
మాయలోకమన్న మర్మంబు దెలియక
మాయ జిక్కి యంత మాయబడిరి
మాయ దెలియ దివ్యమాయరా జన్మంబు
విశ్వదాభిరామ వినురవేమా !
They know not the secret that this is all a world of delusion. They are entangled in delusion and deluded. If you only understand this delusion you shall attain the celestial regeneration.
సతులు సుతులు మాయ సంసారములు మాయ
ధనము ఘనము మాయ తనువు మాయ
మాయదెల్చువాడు మర్మజ్ఞుడగుయోగి
విశ్వదాభిరామ వినురవేమా !
Wives and sons are delusion; connections are delusion; wealth and greatness are delusion; the body is delusion, he that is aware of this delusion is the sage who knows all secrets.
మాయలోన బుట్టి మాయలోన పెరిగి
మాయ దెలియలేని మనుజుడేల
మాయ దెలియువాడు మహిమీద ధన్యుండు
విశ్వదాభిరామ వినురవేమా !
Born in delusion, grown in delusion to what end is a man who cannot discern the nature of delusion. He wha can understand this delusion is the only happy man in the world.
మాయల సంసారమునకు
మాయలనే తిరుగుచుండు మనుజుడు లోనై
మాయల దెలిసిన యంతట
మాయలనే ముక్తి కలుగు మహిలో వేమా
For the sake of delusive worldly state, a man being ensnared in it wanders in delusion. After he understands this delusion through delusion itself he attains beatitude; that is, his sins, by his quitting them, becomes source of felicity.
సిద్ధమైనమాయ జిక్కి యున్నంతకు
తుర్యమగు పదంబు దొరకబోదు
సిద్ధమైన తత్వసిద్ధి గావలె సుమ్ము
విశ్వదాభిరామ వినురవేమా !
As long as we are held in the present delusion, the abode of the true state (of perfection) is beyond beyond our reach. Then let us become perfected in accomplished essence.
తన నిజరూపము జూడును
తనమాయను బుట్టు తనదు తనువని చూచు
తనలోనె తత్వసంపద
గనువాడే పరమయోగి గదరా వేమా
When we see our true figure shall we see truly that our body is born of delusion. He alone who beholdeth within himself the possession of the truth, this is the parama yogi.
మాయలోనిమాయ మాయకు పెనుమాయ
మాయ గనిన మాయ మాయమాయ
మాయగాని మాయ మాయపో తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమా !
The delusion of delusion is the great maya; the maya that hath not suffered delusion is unknown; it exists not. The maya that is not delusion is truth.
మోదమునను గురుని ముఖ్యకరుణచేత
తొమ్మిదిస్థలముల దొడ్డు బాయ
సర్వజీవు డాయె సర్వము దానాయె
విశ్వదాభిరామ వినురవేమా !
(Mystic) If through pleasure, and the favour of the teacher, if thou quit this house with nine doors, thou shalt become the universal spirit and the universe.
Labels: vemana_padyamulu, verses_of_vemana
Saturday, 19 May, 2007
వేమన జ్ఞానమార్గ పద్యములు - ఏడవ భాగము (Verses of Vemana -Part 7)
యుండి యుండి యుండి యుండలేక
యుండ వెరవు దెలిసి గండు దొంగను బట్ట
చెండి చెండి తావు జేరు వేమా
Is not there one man living of good position? He may live some days in comfort. After living, living and living he lives no longer. If he will know the path to happiness, let him seize that stout thief, his mind cut into pieces and prepare a dwelling for himself in heaven.
తను వనేటి యింట తన శత్రు మిత్రుల
దెలియని వాని తెలివదేమి
తెలిసిన మనుజునకు దివ్యామృతంబురా
విశ్వదాభిరామ వినురవేమా !
What is the wisdom of that man who in the house of the body cannot distinguish his friends and foes? On him who knoweth them shall Divine ambrosia (amrutham) be bestowed.
నది నుదకంబును జనుక్రియ
మది నొదవెడు తత్త్వబుద్ధి మగ్నత లెల్ల
తుద పదవిగలయ ఘనుడగు
నుదధి ప్రవేశించుగంగ యెప్పున వేమా!
Like as water flows in its channel thus does an immersion in that knowledge of ruth that arises in the mind ultimately (through an absorption in the final essence) constitute the perfect saint. Then is he like to the Ganges when her streams reach the ocean ( a corret version of awful intricacy).
మనసు బారవిడిచి మనసు దా మగుడించి
మనసులోన గలుగు మర్మ మెరిగి
మనసు దాను నిల్ప మరియు దా బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా !
Casting away the mind and turning it back knowing the secret heart and if thou fix thy mind, this is the greatest task of religion.
దేహాభిమన ముండగ
మోహాదులు జననవార్ధి ముంచును కలగా
నీహారి విషయ భావన
కూహాదులు బోలు మేలుకొన్నను వేమా
While pride of body remains, love and he lust plunge us in the ocean of reproduction. Therfeorre, desire, mental enemies, senses, thoughts, deceit and fraud are all like to dream, let us awake O Vema!
మర్మమంత గొనక మనసు యేకము గాక
పరరహస్యమంత బైలపడదు
పడిన మానమెన్న బైల బడినరీతి
విశ్వదాభిరామ వినురవేమా !
If you comprehend not the entire secret and if thy mind be not bound up to one aim, the Divine secret shall not be revealed to thee. Should it be shewn openly it would be but as the unveiling of the secret parts.
ఈ తనువునందు జూచిన
నేతనువుల కింతె యనుచు నెదురుం దన్నుం
జూతురుగా లోజూపున
నాతురమున తపసునెల్ల నమరగ వేమా
If we look into these our bodies let us with inner vision consider that the nature our forms possess is also that of all other bodies - with devotion do all penitents, behold this.
గురువు పరమ గురుని గురుతుగా దెలియక
గురువు తానుయుండు గుడ్డిరీతి
గురునకు గురులైన గురువు ప్రాణేశుండు
విశ్వదాభిరామ వినురవేమా !
If the teacher knows not in his character, the prime teacher, he is himself as blind. The teacher who teaches the teacher is the lord of life.
నియమాది సంగుడై నిలిచిన తత్త్వంబు తామసంబగు నిద్ర దలగజేయు
నిద్ర తలంగిన నిర్భీతి నొందించు శమమున నానంద సమితి పుట్టు
నానందమున విశ్వమంతయు దానగు తాను విశ్వంబైన్ తత్త్వమగును
తత్త్వ మింద్రియ పంచకత్వంబునను నిల్చు తత్త్వంబు నిలిచిన దానెయగును
రాజయోగీంద్రు డాతడై తేజరిల్లు
వెలయ జగముల విహరించు విశ్రుతముగ
బాలుని విధంబునను వృద్ధు పగిది సోకు
కరణి వెంగలిక్రియ జూడ ఘనత వేమ
If first thy intellect steadfastly attached to thy resolution, it shall dissipate this blind sleep. If this sleep be dissipated, it shall cause thee to attain fearlessness. By trnquility thou shall gain the assemblage of all felicity. By that felicity thou shall become the whole world. By being united to the universe thou shalt become divine essence. By subduing thy senses, the essence (permanent life) shall remain stable in thee. If thou thus fix divine essence, thou shalt become it. By becoming the lord of the king of saints thou shalt shine brilliantly; thou shalt walk in delight and with deliracy like an infant, like to an aged man, like a spirit (nocturnal apparition) like a mad man shalt thou be. Behold thus, shalt thou act in thy dignity.
మనసున నెరుకను మరుపును
గని విని చూడంగలేరు కదిపిన పిదప
పెనగొని పట్టేమంటే
మనుచోటను మాయ మాయ మహిలో వేమా
Whatever there be of knowledge and ignorance in the mind, we can neither perceive, see nor hear it. If we attempy to ake hold on the mind to seize and bind it we shall see that the body is replete with delusion and nothing but delusion.
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
పాట:
ఆత్మ వినాశాపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా
శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా
కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువుని చూపి తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం
తెలిసీ భుజం కలిపి రారేం
అలాటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా!
ఓ అనాథ భారతమా!! .....................అర్థ...
అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా?
వెలుగుని తప్పుకు తిరగాలా?
శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా?
అన్నల చేతిలో చావాలా?
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
ఈ సంధ్యా సిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా
గతి తోచని భారతమా.................అర్థ...
తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకుని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తూందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా
ఓ విషాద భారతమా ......................అర్థ...
Labels: sirivennela_paaTalu
విధాత తలపున ప్రభవించినది
అతడు:
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం .........
ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓం .........
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సరస స్వర సుర ఝురీ గమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం
ఆమె:
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన్
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన
పలికిన కిల కిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా ...........విరించినై....
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్ఠి విలాసములే ..................విరించినై...
అతడు:
నా ఉచ్ఛ్వాసం కవనం - నా నిశ్వాసం గానం ...........సరస...
Labels: sirivennela_paaTalu
వేమన జ్ఞానమార్గ పద్యములు - ఆరవ భాగము (Verses of Vemana -Part 6)
మనసులోని వాని మరల దిగిచి
మనసు నిల్పువాడు మర్మజ్ఞు డగుయోగి
విశ్వదాభిరామ వినురవేమా !
Understanding well in thy mind uniting thyself with thy mind and seizing him who is in thy mind - he that can stay his mind, this is the yogee who knows the great secret.
తానె తత్త్వమనుచు త న్నెరుగగలేక
మాయ తత్త్వ మనుచు మరుగుచుండు
ధర్మ కర్మములను తగ రోయ తత్త్వమౌ
విశ్వదాభిరామ వినురవేమా !
Ignorant that he is himself the truth, he loves delusion which he imagines to be truth. If truly he sought for uprightness and virtue ( dharma and karma) this should be, to him, that is the source of happiness.
నిరతం బెడతెగకుండ
బరిపూర్ణ బ్రహ్మ మాత్మపదమున నుంచ
నిరవద్యమైన పదవిని
జరియించును జగ మెరుంగ సత్యము వేమా
He, who constantly, without inermisson holdeth the all pervading Divinity in (the place of) his soul, he shall arrive at the ineffable dwelling, he shall truly comprehend the world-this is the truth.
తరుచు చీకటి విడి తరితోడ దను మర్చి
పరమునందు మనసు బదిలపరచి
గరిమయున్న యట్టి ఘనుడెందు లేడురా,
విశ్వదాభిరామ వినురవేమా !
Quitting this thick darkness of ignorance he who in due time forgetteth himself, and who fixeth his mind with care on the supreme, this great noble sage no where is to be found.
త్రాడు పాము యనుచు దాజూచి భయపడి
తెలిపి త్రాడటన్న తీరు భయము
భయము దీరినపుడె బ్రహ్మంబు నంటురా
విశ్వదాభిరామ వినురవేమా !
As when one sees a rope and mistakes it for a snake he is alarmed, but when he knows it is a rope his fear is over. Thus only when fear departs, can we know the true nature of god.
చూచువారికెల్ల జూడ వేరై యుండు
చూపు జూచి తెలియ జూచువారు
చూచి తాము చూపు చూపు తా మగుదురు
విశ్వదాభిరామ వినురవేమా !
The Divinity appears diversely to all those who look him. They who are seeing see and see him with understanding shall behold him; they themselves shall become that vision and that vision, them.
కుండలియోగము దెలిసిన
బండాలపు యోగి కేల బాలకి పొందుల్
దండిగ నీ తనువందే
మెండుగ నొక ముక్తికాంత మెలగురా వేమా
He who comprehends the creed of the sping (kundali) what hath that safe of might to do with the embraces of a girl - nobly in this body shall the maid of beatitude alone shine.
వేమన జెప్పిన వేదము
వేమనకే తెలుయుగాని విను డెరుగ రొరుల్
వేమన నెరిగిన వారికి
వేమరు నేకాక్షరంబు విదితము వేమా
The Veda taught by Vemana in known to him alone, Hear! Others know it not. To those who understand Vemana shall the one letter (Om) be a thousand times taught and permanently impressed on their mind.
దేహియు జ్ఞానానలమున
దాహంబై దేహ మెల్ల్ తల్లడపడ నా
దేహములో పొర్లాడుచు
మోహ మడచి శివునిజూడ ముక్తిర వేమా
The corporal form being burnt in the flame of wisdom the body is all vexed crushing all that desire, that (rolls about or) is afflicted to the body. If thus we behold God, this is beatitude, O Vema!
ధ్యాని వలెనె యుండు మౌని వలెనె యుండు
భోగివలెను నుండు రోగివలెను
సకలము దెలిసినను సర్వజ్ఞుడై యుండు
పరమయోగివలెను పరగ వేమా
He is like to a meditator, like a dumb man, like to an enjoyer, like a diseased one. He who knows every state shall become Omniscient and be like the prince of yogees.
Labels: vemana_padyamulu, verses_of_vemana
వేమన జ్ఞానమార్గ పద్యములు - ఐదవ భాగము (Verses of Vemana -Part 5)
ముక్తుడైన గాని మునియు గాడు
మునికిగాని సర్వమోహంబు లూడవు
విశ్వదాభిరామ వినురవేమా !
Unless thou give up thy lusts thou shall not be releases from thy ties. Unless thou be free thou art no devotee. None but a devotee can be freed from all desires.
ఆత్మలోని నాద మాలించి యాలించి
యాశలందు జిక్క డాదియోగి
యాత్మలోని కళల నంటు నా తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమా !
If you listen and listen to the voice within thy soul, the first saint shall not be entangled in desires. If thou attain light in the soul, this beatitude.
మానసంబు మంచి మల్లెసాలె చవికె
బావితోట జేసి బాలగూడి
భోగి నయ్యద నన బోయెబో కాలంబు,
విశ్వదాభిరామ వినురవేమా !
Convert thy mind into a fair chamber built in summer mansion (pleasure house) with a bath, well and garden. Prepare it for meeing the maid of wisdom in secret and enjoying her charms. Thus let thy hours sweetly glide away.
సొమ్ము ఉన్నచోట శోధింపగలుగును
సొమ్ము లేనిచోట శోధ యేల
అంజనంబు లేక ఆ సొమ్ము తెలియదో
విశ్వదాభిరామ వినురవేమా !
If thou search in the place where the thing is, thou shall find it. Why search in a place where it is not? Without the conjuration of deep thought thou cannot attain that thng that is above all desirable.
నిజము నేల నెరిగి నిత్యుండు గాడయ
పలుకులోని బిందు పదిలపరిచి
వేడుకైన బిందు వెత పెట్ట కుందురా
విశ్వదాభిరామ వినురవేమా !
How did he learn all the truth, and yet fail of becoming the Eternal; carefully ascertaining the mystic word in abstraction, they distribute instruction regarding the wondrous form.(loose version).
అగ్నిశిఖలయందు నమరంగ మమకార
మభవు మీద ధ్యాన మలర నునిచి
యాహుతియగు వెనుక హరున కర్పితమౌను
విశ్వదాభిరామ వినురవేమా !
In the flame of fire when thou hast firmly immolated (as a holocaust) all personal affection fixing thy thought on the unborn, this shall be an acceptable dedication to Hari.
మాకున ననలము బుట్టును
మాకెరుగునె ననలమునికి మనుజులలోన
మాకున ననలము క్రియ జీ
కాకుడిగిన యోగి నెవరు గానరు వేమా
Though fire is produced in a tree, is the tree conscious of that fire? Like the fires is concealed in the tree, thus no one can perceive the nature of the devotee who hath dispelled those passions that harass the soul.
అండములో నాకాశం
బుండంగా చూడ జూడ నొనరగనాపై
నుండును, అన్నియు దెలిసిన
మెండుగ నెటుచూచి చన్న మేలగు వేమా
To gaze and gaze on the firmament in the mundane egg shall be excellently sweet to the sage if he fully meditates on it; abundantly blessed shall he be in whatever direction he directs his view or his steps.
బమ్మగుడ్డు యనెడి పట్నంబు లోపల
బమ్మ యెరుగలేని బాప డేల
తన మనంబు దెలియ దానెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా !
How can he be a (brahmin) Divine who knoweth not (Brahma) the Divinity in the city of the Divine egg or universe? To understand by own mind, go to, this is (Brahminity) Divinity.
గురువు చెప్పువిద్య గురునకు దెలియును
గురువు చెప్పు విద్య గురువు యెరుగు
గురువు మహిమ పరమగురునకు దెలియును
విశ్వదాభిరామ వినురవేమా !
The science taught by a teacher is known to the teacher. The teacher knoweth what the teacher explaineth. The power of the teacher is known to the primal teacher.
Labels: vemana_padyamulu, verses_of_vemana
Monday, 14 May, 2007
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి ...
విశ్రమించవద్దు ఏ క్షణం - విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా ...
Labels: sirivennela_paaTalu
వేమన జ్ఞానమార్గ పద్యములు - నాలుగవ భాగము (Verses of Vemana -Part 4)
జూసి యాసల నటు గోసివేసి
వాసనను దెలిసిన వాడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా !
Consider the soul in it’s fourth state (the turyavstha or death); view it minute as a mote (cucumber-prickle). Hereby cut off all attachment to earthly desires. He who comprehendeth the essence (or savour) of wisdom, go to, he is Divinity.
వెదికి కానలేడు వేదాంత వేద్యుని
తత్వవేత్త లేడు ధరణిలోన
కలిగెనేని యతడు కనబోడు మరి వేరే
విశ్వదాభిరామ వినురవేమా !
Though he searches, he cannot see the teacher of wisdom (vedanta). There is none in the world who can discover truth, even he be found he will not look into an other object.
విషయముల బొరలి రోయక
విషమంటున గతిని జూచు విధమున ధరలో
విషమను మాయా సుఖముల
విషయములో గూడుకుండ్రు వేత్తలు వేమా
He that doth not wallow in nor seek the enjoyments of sensual objects, who (in the earth) see the path of obtaining those objects who yet calls all those deceptive pleasures which proceed from sensual objects sensuality, they are the wise. They enjoy this world declaring they enjoy it not.
వాక్కు నందు గుర్వు వాక్తత్వమున గుర్వు
చీకటిలో గుర్వు చిక్కియుండు
నఖికమునకు గురువు యాధారమై యుండు
విశ్వదాభిరామ వినురవేమా !
The great teacher is concealed in the world. The teacher is the Essence of the world. The teacher is hidden in darkness. The eacher is the support of all.
కర్మాకర్మము లొక్కటు
కర్మవినోదునకు దత్వఘుననకు దెలియున్
ధర్మాధర్మము లేర్పడ
నిర్మలమతి దెలుపవలయు నిజముగ వేమా
Action and inaction are the same to him who sports with his acts and to him who is mighty in tatva. If thou understand it from a determination of what is right and what the contrary with pure mind truly set it forth.
ఈషణత్రయంబు నెడపంగనేరక
మోహరాశిలోన మునిగియుండు
జనులకెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగును
విశ్వదాభిరామ వినురవేమా !
They who are not able to free them from the trio of attachment (to sons, wife and wealth) shall remain plunged in he multitude of desires. How shall they attain the bliss of beatitude?
ఎరుకుమాలు జీవి యెంతకాలంబుండి
చచ్చి పుట్టుచుండు సహజముగను
యెరుక మరుచుచోటు నెరుగుత బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమా !
The senseless body continueth for a while dies, and is reproduced in the course of nature. S know that mansion of absorption where thou shall forget knowledge. This is Divinity.
సద్గురుకృప జ్ఞానంబున
సద్గతి దీవింపుచున్న చాలా చదువుల్
సద్గతి గలుగగ జేయును
సద్గురువే దైవ మనుచు జాట వేమా
It is the favour of the excellent teacher and through much sudy that is illumed with knowledge and (good conduct) ethics, that shall put thee into right path. Teach men that the excellent teacher is himself a part of the Divinity.
సిగ్గు విడువకున్న శివసౌఖ్యమును లేదు
తగ్గి మొగ్గకున్న సిగ్గు విడుడు
సిగ్గు విడుచువాడు చిరకాల జీవిరా
విశ్వదాభిరామ వినురవేమా !
If thou have not lost shame thou shall not attain the delight of god; unless thou humble and incline thyself shame will not leave thee. He who hath given all shame shall live a lengthened age(i.e, a man to be perfect must be independent of opinions)
అమ్మ సుమీ యాలనగా
నమ్మనగా నాలు సుమీ యా యిద్దరినిన్
ఇమ్మహిలో పరమాత్ముని
నెమ్మదిలో తెలియ దానె నేర్పరి వేమా
Surely thy mother is thy wife and thy wife thy mother. Wise is he who has comprehended this regarding these two (incomplete).
Labels: vemana_padyamulu, verses_of_vemana
Sunday, 13 May, 2007
వేమన జ్ఞానమార్గ పద్యములు - మూడవ భాగము (Verses of Vemana -Part 3)
జీవబుద్ది వలన జీవుడయ్యె
మోహబుద్ధి లయము ముందర గనుకొను
విశ్వదాభిరామ వినురవేమా !
By knowledge f the great spirit he himself became all things. By the knowledge of life he became living. Let us first attain the destruction of love and opinion?
ఈ దేహమెన్ని భంగుల
బ్రోదియు నొనరొంచనేల పోవుట కాదే
మీ దెరిగి మురికి గడుగుచు
భేదంబులు మాన ముక్తి బెరయుర వేమా.
Why should ye in so many ways take care of this body? Will it not perish? If kowing futurity ye purge away your impurities putting an end to destructions ye shall attain beatitude.
పిల్లి చుంచు బట్టి ప్రియముననుండక
నదియు కోడి బట్ట నునగమించు
మమత విడవకున్న మానునా మోహంబు
విశ్వదాభిరామ వినురవేమా !
The cat having caught a muskrat delights not in it; but pursues the fowl to seize it. Without relinquishing the delights (posession) will love cease?
ఏక బ్రహ్మము నిత్యము
వైకల్పిక మైనయట్టు వస్తువు లెల్లన్
ఏకత్వం బని యెరిగిన
శోకములే కల్ల ముక్తి సులభము వేమా.
The only god is Eternal; to him who knows that all things curiously compunded are in truth the unity and afflications are as a lie and to him beatitude is easy of attainment.
మరియు దధిని ఘృతము, మానులం దనలంబు,
చారుసుమములందు సౌరభంబు
తిలల తైల మట్ల దేజరిల్లు చిదాత్మ
విశ్వదాభిరామ వినురవేమా !
Again by perfection ghee is produced from curds, fire in trees, fragrance from fine flowers and oil in seeds; thus shineth forth god the soul of intellect.
తరువ తరువ బుట్టు తరువున ననలంబు
తరువ తరువ బుట్టు దధిని ఘృతము
తలప తలప బుట్టు తనువున తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమా !
By friction and friction, fire is produced in a tree. By continual agitation ghee is produced from curd. Thus by perpetual meditation shall divine wisdom be produced in our body.
జీవిని దెలిసిన దనుకను
దేవునిభ్రమ బొదలు నరుడు దేవుడు దలపన్
జీవుండని వివరించిన
భావింపగ ముక్తి బట్టబయలుర వేమా.
Until he explores his own soul, a man acts (or roams) in ignorance of God (or illusion caused by God). If by meditation you comprehend that Gos is a spirit by understanding the beatitude shall be clearly manifested to thee O Vemana.
ఇంతకాల ముండి యెరుకమాలిన జీవి
చచ్చి పుట్టుచుండు సహజ మనుచు
నెరుక మరచు చోటు నెరుగుట బ్రహ్మాంబు
విశ్వదాభిరామ వినురవేమా !
This ignorant soul (living creature) afer living so long imagines that to die and be reproduced is the course of nature. To know that heaven where we shall be so far advanced as to forget instruction. this is spirituality
మ్రానులోన నగ్ని మరి యుండవచ్చు
అగ్నినుండ మ్రాను కలవి గాదు
మ్రానులోని యగ్ని మర్యాద సంసారి
విశ్వదాభిరామ వినురవేమా !
Fir can even exist in a tree. But a tree has no power to remain where fire is. Like to fire in a tree, is the worldy state. It contains hidden the seeds of flame.
మేఘ మడ్డమైన మిహిరుని జెరచును
చిత్త మడ్డమైన స్థిరము జెరచు
మరపు లడ్డమైన మరి ముక్తి జెరచును
విశ్వదాభిరామ వినురవేమా !
If a cloud intervenes in a way destroys the sun. If your inclinations intervene, they destroy your firmness. If forgetfukness takes place, it destroys beatitude itself.
Labels: vemana_padyamulu, verses_of_vemana
వేమన జ్ఞానమార్గ పద్యములు - రెండవ భాగము (Verses of Vemana -Part 2)
దలచిన ఎవ్వరే మనిన దన్నును గాదని నవ్వుచుండు, నా
త్మల దలపోయుచుండు పరతత్వము నిత్యము దానమై సదా
తెలిసిన యోగి వేమనగతి శివరూపుడు నెల్ల తావుల
Though called yet remain silent; Though even again called yet maintain silence, whatever they think, or any one say, let the wise smile as though it was not intended for them; let them meditate in their souls on the supreme, hereby becoming themseles eternal. The hermit thus persistingly learneth like Vemana for ever attain the form of God.
ఒక్కడు రోగి యాయె మరియొక్కడు దిక్కుల ద్యాగియాయె వే
రొక్కడు భోగియాయె నటు యొక్కడు చక్కని యోగియాయె దా
నొక్కడు రాగియాయె నినుబోలు మహాత్ముని గాన మెచ్చ
నిక్కము ఇన్ని రూపములు నీకును జెల్లును నన్న వేమన
One man became discased, one became a donor every where, another became a possessor-such a man became a true saint. One himself became a libertine. but nowhere shall we see a mighty sage like to thee O Vemana-truly all these various forms pertain to thee O brother.
విషయముల దెరలి పొలుపుగ
విషయము లంటక మహాత్ము విధమున ధరలో
విష సంసారము లనియును
విషయము లన్నియును గెల్వ వేమన నేర్చు.
Agreeably to the character of an ascetic relinquish all the objects of carnality (passion). Touch not carnel objects after the manner of a magnanimous sage on earth, consider them the offspring of carnality. Vema hath learned, to subdue all carnality.
కాదని యెవ్వరి తోడను
వాదడవక తిరుగు వెర్రివానిం బలెనే
భేదాభేదము లడచిన
వేదాంత రహస్య మెల్ల వేమన నేర్చు.
Vemana openeth not his mouth to say not to anyone's assertion. Thus he seems like a mad man. He can explain every mystery of that Vedantam which destroys all distinctions and differences. From his knowledge his pathy arises.
పూజ చక్క జేసి పుణ్య మార్జించిన
పూజ్యుడైన గురువు పూజవలన
తేజ మెల్లగాంచి తిరుగ డెన్నటికైన
విశ్వదాభిరామ వినురవేమా !
The worshipful teacher who by the due performances of worship hath attained merit. H by that worship shall see(i.e obtain). Never shall he be changed.
దాన మమరజేసి దరిజేరు నొకవంక
మనము నమ్మెనేని మాయాగల్గు
జ్ఞానకళిక నమ్మి జంపును వైరుల
విశ్వదాభిరామ వినురవేమా !
By freely bestowing gifts you on one hand attain heaven but if you trust to your own mind delusion enters. Trust to the light of wisdom to destroy all that is inimical.
ఇందు నెరుకవాని కిహపరములు లేవు
ప్రాణహాని లేదు ప్రళయమునకు
ప్రళయకాలమైన పరమాత్మ గలయురా,
విశ్వదాభిరామ వినురవేమా !
He whom in this world know wisdom to him, there was no next world(he is as if in heaven). He shall not lose his soul even in death of Brahma. In that he shall be absorbed in the divine mind.
దేవుడనగ వేరె దేశమందున్నాడె
దేవితోడ నెపుడు దేహ మందె
వాహనముల నెక్కి వడి దోలుచున్నడు
విశ్వదాభిరామ వినురవేమా !
Is he whom yo call God in another land? With the Goddess, he is in the body. Mounting his vehicles (the senses), he rapidly drives his chariots.
సొమ్ము దొరుకుదనుక జ్యోతి యంతియె కాక
సొమ్ము దొరుకువెనుక జ్యోతి యేల
దేవుడైన వెనుక దేహంబు యదియేల
విశ్వదాభిరామ వినురవేమా !
Until you find the thing you have lost, you require a light-only so long- after finding it why keep the light? After becoming God why retain the body
గురుచరణము బట్ట కుక్కలు కరుచునా
గురుచరణము విడువ కుక్కగరుచు
కుక్కకున్న గుణము గురునకు లేదురా
విశ్వదాభిరామ వినురవేమా !
If thou fall at the feet of the teacher will the dog of passion seize ye thee? If you leave the teacher's feet, those dogs will seize thee. Indeed, the dog's disposition does not attach to the teacher.
Labels: vemana_padyamulu, verses_of_vemana
వేమన జ్ఞానమార్గ పద్యములు - మొదటి భాగము (Verses of Vemana -Part 1)
He that will become a sage, and with pure faith learn these thousand verses without quitting them surely, the plcae of beatitude is put into the palm of his hand.
Labels: vemana_padyamulu, verses_of_vemana
ఒకటి ఒకటి ఒకటి
మానవులంతా ఒకటి
రెండు రెండు రెండు
మంచి, చెడులు రెండు
మూడు మూడు మూడు
మన జెండా రంగులు మూడు
నాలుగు నాలుగు నాలుగు
వేదాలు మనకి నాలుగు
ఐదు ఐదు ఐదు
చేతికి వేళ్ళు ఐదు
ఆరు ఆరు ఆరు
రుతువులు మనకి ఆరు
ఏడు ఏడు ఏడు
వారానికి రోజులు ఏడు
ఎనిమిది ఎనిమిది ఎనిమిది
దిక్కులు, మూలలు ఎనిమిది
తొమ్మిది తొమ్మిది తొమ్మిది
గ్రహాల కూటమి తొమ్మిది
పది పది పది
పాపలు పాడే పాట ఇది
Labels: bala_geethalu
Saturday, 12 May, 2007
ఘంటసాల భగవద్గీత
యుద్థ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మితృలను చూచి, హృదయము ద్రవించి
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా
స్వజనమును చంపుటకు ఇష్టపడక "నాకు విజయమూ వలదు, రాజ్య సుఖమూ వలదు" అని ధనుర్బాణములను క్రింద వైచె. దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాఁశ్చ భాషసే
గతాసూనగతాసూఁశ్చ నానుశోచంతి పణ్డితాః
దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు
దేహినోస్మిన్యథా దేహే కౌమారఁ యౌవనఁ జరా
తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి
జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము యెట్లో, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుకు ఈ విషయమున ధీరులు మోహము నొందరు
వాసాఁసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సఁయాతి నవాని దేహీ
మనుష్యుడు, ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో,అట్లే, ఆత్మ - జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.
శ్లోకం: ----
ఆత్మ నాశనములేనిది. ఆత్మను శాస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింప జాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది.
శ్లోకం: ----
పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు.
అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.
శ్లోకం: ----
యుద్ధమున మరణించినచో వీర స్వర్గము పొందెదవు. జయించినచో
రాజ్యము భోగింతువు. కావున అర్జునా, యుద్ధము చేయ కృతనిశ్చయుడవై
లెమ్ము.
Labels: ghantasala_bhagavadgita
బంతి బంతి - ఇది నా బంతి
కాళ్ళులేవు - చేతుల్లేవు
గుండ్రని పొట్ట - పొట్టనిండ గాలి
ఎగురును దుముకును - ఇది నా బంతి
Labels: bala_geethalu
బొమ్మలమ్మా బొమ్మలు
రంగురంగుల బొమ్మలు
రకరకాల బొమ్మలు
సింగారాల బొమ్మలు
బంగారు బొమ్మలు
ఆడేపాడే బొమ్మలు
అందమైన బొమ్మలు
నీతిని నేర్పే బొమ్మలు
ఖ్యాతిని కూర్చే బొమ్మలు
Labels: bala_geethalu
వానా వానా వల్లప్ప
మనిషిగా పుటిన దెందుకురా?
మంచిని పెంచేటందుకురా
బడికి వెళ్ళే దెందుకురా?
చదువులు నేర్చేటందుకురా
చదువులు నేర్చే దెందుకురా?
జ్ఞానం పొందేటందుకురా
జ్ఞానం పొందే దెందుకురా?
ప్రగతిని పెంచేటందుకురా
ప్రగతిని పెంచే దెందుకురా?
చక్కగ బ్రతికేటందుకురా
Labels: bala_geethalu
చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా?
తోట కెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కున మింగావా?
Labels: bala_geethalu
తారంగం తారంగం
తాండవకృష్ణా తారంగం
వేణునాథా తారంగం
వేంకటరమణా తారంగం
వెన్నెలదొంగా తారంగం
చిన్నికృష్ణా తారంగం
Labels: bala_geethalu
దాగుడుమూతలు దండాకోర్
పిల్లీవచ్చె ఎలకా భద్రం
ఎక్కడి దొంగలు అక్కడే
గప్‌చిప్....గప్‌చిప్
కళ్ళూమూసి కోలికోల్
ఎక్కడి దొంగలు అక్కడే
అణుక్కో ముణుక్కో దాక్కో
గప్‌చిప్....గప్‌చిప్
Labels: bala_geethalu
చేతిలో వెన్న ముద్ద
చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు
పట్టుదట్టి
సందె తాయెతులు
సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణా
నిన్ను చేరికొలుతు
Labels: bala_geethalu
చుక్ చుక్ రైలు వచ్చింది
దూరం దూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డూ మిఠాయి తినిపిస్తా
కమ్మని పాలూ తాగిస్తా.
Labels: bala_geethalu
ఏనుగమ్మ ఏనుగు
ఏ ఊరెళ్ళిందేనుగు
మా ఊరెళ్ళిందేనుగు
మంచినీళ్ళు తాగిందేనుగు
ఏనుగమ్మ ఏనుగు
ఏ ఊరెళ్ళిందేనుగు
మా ఊరెళ్ళిందేనుగు
మంచినీళ్ళు తాగిందేనుగు
ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు
Labels: bala_geethalu
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురము చేయనన్నది
అత్తతెచ్చిన కొత్తచీర కట్టనన్నది
మామతెచ్చిన మల్లెపూలు ముడువనన్నది
మొగునిచేత మొట్టికాయ తింటానన్నది
Labels: bala_geethalu
తప్పెట్లోయ్ తాళాలోయ్
దేవుడి గుళ్ళో బాజాలోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్
పాలు నెయ్యి పాపడికోయ్
Labels: bala_geethalu
చిట్టీ చిట్టీ చెల్లమ్మా
పలకాబలపం తేవమ్మా
అక్షరాలు నేర్వమ్మా
చదువు బాగా చదవమ్మా
తెలివిని బాగా పెంచమ్మా
ఇంటికిపేరు తేవమ్మా .
Labels: bala_geethalu
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్!
దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయి;
పూని యేదైనాను వొకమేల్
కూరి జనులకు చూపవోయి !
స్వంతలాభం కొంతమానుకు
పొరుగువారికి తోడుపడవోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్!
చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్!
Labels: bala_geethalu
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
Labels: bala_geethalu
Subscribe to Posts [Atom]