Sunday, 13 May, 2007

 

ఒకటి ఒకటి ఒకటి

ఒకటి ఒకటి ఒకటి
మానవులంతా ఒకటి

రెండు రెండు రెండు
మంచి, చెడులు రెండు

మూడు మూడు మూడు
మన జెండా రంగులు మూడు

నాలుగు నాలుగు నాలుగు
వేదాలు మనకి నాలుగు

ఐదు ఐదు ఐదు
చేతికి వేళ్ళు ఐదు

ఆరు ఆరు ఆరు
రుతువులు మనకి ఆరు

ఏడు ఏడు ఏడు
వారానికి రోజులు ఏడు

ఎనిమిది ఎనిమిది ఎనిమిది
దిక్కులు, మూలలు ఎనిమిది

తొమ్మిది తొమ్మిది తొమ్మిది
గ్రహాల కూటమి తొమ్మిది

పది పది పది
పాపలు పాడే పాట ఇది

Labels:


Saturday, 12 May, 2007

 

బంతి బంతి - ఇది నా బంతి

బంతి బంతి - ఇది నా బంతి
కాళ్ళులేవు - చేతుల్లేవు
గుండ్రని పొట్ట - పొట్టనిండ గాలి
ఎగురును దుముకును - ఇది నా బంతి

Labels:


 

బొమ్మలమ్మా బొమ్మలు

బొమ్మలమ్మా బొమ్మలు
రంగురంగుల బొమ్మలు
రకరకాల బొమ్మలు
సింగారాల బొమ్మలు
బంగారు బొమ్మలు
ఆడేపాడే బొమ్మలు
అందమైన బొమ్మలు
నీతిని నేర్పే బొమ్మలు
ఖ్యాతిని కూర్చే బొమ్మలు

Labels:


 

వానా వానా వల్లప్ప

వానా వానా వల్లప్ప
చేతులు చాచు చెల్లప్ప
తిరుగు తిరుగు తిమ్మప్ప
తిరుగలేను నరసప్ప.

Labels:


 

మనిషిగా పుటిన దెందుకురా?

మనిషిగా పుటిన దెందుకురా?
మంచిని పెంచేటందుకురా

బడికి వెళ్ళే దెందుకురా?
చదువులు నేర్చేటందుకురా

చదువులు నేర్చే దెందుకురా?
జ్ఞానం పొందేటందుకురా

జ్ఞానం పొందే దెందుకురా?
ప్రగతిని పెంచేటందుకురా

ప్రగతిని పెంచే దెందుకురా?
చక్కగ బ్రతికేటందుకురా

Labels:


 

చిట్టి చిలకమ్మ

చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా?

తోట కెళ్ళావా?
పండు తెచ్చావా?

గూట్లో పెట్టావా?
గుటుక్కున మింగావా?

Labels:


 

తారంగం తారంగం

తారంగం తారంగం
తాండవకృష్ణా తారంగం

వేణునాథా తారంగం
వేంకటరమణా తారంగం

వెన్నెలదొంగా తారంగం
చిన్నికృష్ణా తారంగం

Labels:


 

దాగుడుమూతలు దండాకోర్

దాగుడుమూతలు దండాకోర్
పిల్లీవచ్చె ఎలకా భద్రం
ఎక్కడి దొంగలు అక్కడే
గప్‌చిప్....గప్‌చిప్

కళ్ళూమూసి కోలికోల్
ఎక్కడి దొంగలు అక్కడే
అణుక్కో ముణుక్కో దాక్కో
గప్‌చిప్....గప్‌చిప్

Labels:


 

చేతిలో వెన్న ముద్ద

చేతిలో వెన్న ముద్ద
చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు
పట్టుదట్టి

సందె తాయెతులు
సరిమువ్వ గజ్జెలు
చిన్నికృష్ణా
నిన్ను చేరికొలుతు

Labels:


 

చుక్ చుక్ రైలు వచ్చింది

చుక్ చుక్ రైలు వచ్చింది
దూరం దూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డూ మిఠాయి తినిపిస్తా
కమ్మని పాలూ తాగిస్తా.

Labels:


 

ఏనుగమ్మ ఏనుగు

ఏనుగమ్మ ఏనుగు
ఏ ఊరెళ్ళిందేనుగు
మా ఊరెళ్ళిందేనుగు
మంచినీళ్ళు తాగిందేనుగు

ఏనుగమ్మ ఏనుగు
ఏ ఊరెళ్ళిందేనుగు
మా ఊరెళ్ళిందేనుగు
మంచినీళ్ళు తాగిందేనుగు

ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు

Labels:


 

బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది

బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురము చేయనన్నది
అత్తతెచ్చిన కొత్తచీర కట్టనన్నది
మామతెచ్చిన మల్లెపూలు ముడువనన్నది
మొగునిచేత మొట్టికాయ తింటానన్నది

Labels:


 

తప్పెట్లోయ్ తాళాలోయ్

తప్పెట్లోయ్ తాళాలోయ్
దేవుడి గుళ్ళో బాజాలోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్
పాలు నెయ్యి పాపడికోయ్

Labels:


 

చిట్టీ చిట్టీ చెల్లమ్మా

చిట్టీ చిట్టీ చెల్లమ్మా
పలకాబలపం తేవమ్మా
అక్షరాలు నేర్వమ్మా

చదువు బాగా చదవమ్మా
తెలివిని బాగా పెంచమ్మా
ఇంటికిపేరు తేవమ్మా .

Labels:


 

దేశమును ప్రేమించుమన్నా

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్!

దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయి;
పూని యేదైనాను వొకమేల్
కూరి జనులకు చూపవోయి !

స్వంతలాభం కొంతమానుకు
పొరుగువారికి తోడుపడవోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్!

చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్!

Labels:


 

ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

Labels:


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]